ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

55 నిమిషాల క్రితం

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 03:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మండపేట: మండలంలోని ఏడిద గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన బాధితులను ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఏడిద గ్రామం సంఘమేశ్వరం వెళ్లే మార్గంలో నివాసం ఉంటున్న పరదక్షిణ పోచమ్మ, పరదక్షిణ చిన్నారిలకు చెందిన రెండు తాటాకు ఇళ్లు శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందేలా చూస్తామని ఆయన అన్నారు. అనంతరం బాధితులను ఆదుకునేందుకు కూటమి నాయకులు సమకూర్చిన రూ.30 వేల ఆర్థిక సాయం, 40 కేజీల బియ్యాన్ని, అలాగే ఎమ్మెల్యే వేగుళ్ళ స్వీయ నిధులు రూ.10 వేల సహాయాన్ని కలిపి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్