సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ వర్శిటీ సమీపంలో దారుణం

06 సెప్టెంబర్, 2026

Delhi Building
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- హాస్టల్‌ భవనం కుప్పకూలి ముగ్గురు మృతి

- పలువురికి గాయాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో భవనాలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం కూడా మరో భవనం కుప్పకూలింది. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని ‘సత్య నికేతన్’ ప్రాంతంలో ఉన్న హాస్టల్‌ భవనం కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, తీవ్రంగా గాయపడిన వారికి జయప్రకాశ్ నారాయణ్‌ అపెక్స్ ట్రామా సెంటర్‌లో చికిత్స అందిస్తున్నామని సౌత్‌వెస్ట్ అడిషనల్ డిసిపి-1 అభిమన్యు పొస్వాల్ తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకున్న తొమ్మిదిమంది మందిని కాపాడామని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పొస్వాల్ వెల్లడించారు. దుమ్మూధూళి కారణంగా శిథిలాల కింద ఉన్నవారికి ఆక్సిజన్ అందని పరిస్థితి నెలకొందని, ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేఖా గుప్త.. లోక్ నారాయణ్ ట్రామా కేర్ సెంటర్‌కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్