సన్మాన సభలో పలువురు ప్రశంసలు
ప్రజాశక్తి- గణపవరం : ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు విద్యాబోధన అందించడంతోపాటు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్‌టీయూ నాయకుడిగా సంకు ఏసుబాబు చేసిన కృషి మరువలేనిదని ఎస్‌టీయూ రాష్ట్ర నాయకులు సాయి శ్రీనివాసు అన్నారు. గణపవరం మండలం వరదరాజపురంలోని కేవీపీ కన్వెన్షన్ హాల్‌లో బువ్వనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసి, ఏలూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సంకు ఏసుబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాసు మాట్లాడుతూ గణపవరం, నిడమర్రు మండలాల్లో ఉపాధ్యాయ సంఘాల నిర్మాణానికి ఏసుబాబు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విద్యార్థిగా తాను చదువుకున్న బువ్వనపల్లి పాఠశాలలోనే హెచ్‌ఎంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో గణపవరం ఎంఈఓ జి. బాలయ్య, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏసుబాబు దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.







కామెంట్‌లు (0)