ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

"అంతా రాములోరు చూస్కుంటారు" - టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్

1 గంట క్రితం

sangeet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 02:52 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : "అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ - ‘‘ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన లవ్ స్టోరీతో మా "అంతా రాములోరు చూస్కుంటారు"ను నిర్మిస్తున్నాం. మా టైటిల్ లో ఉన్నట్లు అంతా రాములోరు చూసుకుంటారు. మా టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా’’ అని అన్నారు. డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ ..‘‘మా మూవీలో హీరో సంగీత్, హీరోయిన్ అనస్వర క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వీళ్ల పెయిర్ మనందరినీ మోటివేట్ చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి జంట అనే ఫీల్ కలిగిస్తారు. సంగీత్, అనస్వర అంత బాగా ట్యూన్ అయ్యారు. అంతా రాములోరు చూస్కుంటారు అనే టైటిల్ మేము ఊరికే పెట్టలేదు. దాని వెనక కాన్సెప్ట్ ఉంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా ’’ అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - ‘‘నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను లాంటి ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహాలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీతో "అంతా రాములోరు చూస్కుంటారు" చిత్రాన్ని నిర్మించాను. ఏడాది క్రితం ఈ కథ విన్నప్పుడు నా ఫేవరేట్ మూవీలా లైబ్రరీలో ఉండిపోతుంది అనిపించింది. మనమంతా ఈ సినిమాతో ప్రేమలో పడతాం. మ్యాడ్ సినిమా కంటే ముందే సంగీత్ తో సినిమా చేయాలని అనుకున్నాను. సరైన స్క్రిప్ట్ దొరకలేదు. ఈ కథ విన్నప్పుడు సంగీత్ కు కరెక్ట్ సబ్జెక్ట్ అనిపించింది. ఈ చిత్రంలో శిరీష పాత్రకు అనస్వరను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాం. ఆరు నెలలు ఆమె వెంట పడి డేట్స్ తీసుకున్నాం. సినిమా మీద ప్యాషన్ తో నాతో కలిసి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న గిరికి థ్యాంక్స్’’ అని అన్నారు. హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ - ‘‘మా మూవీ టైటిల్ గ్లింప్స్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. మా మూవీని కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. సినిమాలోని ప్రతి సీన్ మీకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాను గోదావరి జిల్లాల నేపథ్యంతో చేశాం. అక్కడి వాతావరణం చూస్తుంటే మినీ కేరళలా అనిపించింది. అక్కడ వాళ్లు చూపించే లవ్, దొరికే ఫుడ్ చాలా బాగున్నాయి. అక్కడి స్పెషల్ స్వీట్స్ టేస్ట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఫినిష్ చేయాల్సిఉంది. మీరంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి థియేటర్స్ కు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలోని శిరీష, మారుతి క్యారెక్టర్స్ ను మీరు ప్రేమిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ -‘‘ సండే అయినా మా మూవీ టైటిల్ గ్లింప్స్ లాంఛ్ కు వచ్చి మీరు చూపిస్తున్న లవ్ కు చాలా థ్యాంక్స్. మ్యాడ్ సినిమా నుంచి మీరు నాపై ఇలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. అదంతా రాములోరి దయ అనుకుంటాను. ఇది టైటిల్ గ్లింప్స్ కాబట్టి మూవీ గురించి ఎక్కువగా చెప్పను. నెక్ట్స్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. రాకాస తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలని డైలమాలో ఉన్న టైమ్ లో ధీరజ్ ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చాడు. సూర్యప్రతాప్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ లోని ఎమోషన్స్ లేయర్స్ అన్నీ నచ్చాయి. ప్రతి సీన్ ను ఊహించుకోగలిగాను. ఈ సినిమాలో ఆద్యంతం మీ ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చేలా సీన్స్ ఉంటాయి’’ అని అన్నారు.

నటీనటులు - సంగీత్ శోభన్, అనస్వర రాజన్, తదితరులు


టెక్నికల్ టీమ్

-----------------

రైటర్ - లక్ష్మీ భూపాల్

సమర్పణ - శ్రీమతి శ్రావణి

బ్యానర్స్ - ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్

నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని

డైరెక్షన్ - పల్నాటి సూర్యప్రతాప్

డిజిటల్ మార్కెటింగ్ - హౌస్ ఫుల్ డిజిటల్

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా) & వంశీ కాక

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్