సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెల్లూరు తీరం అల్లకల్లోలం - బోటులో చిక్కుకున్న మత్స్యకారులు

1 గంట క్రితం

Nellore coast in turmoil Fishermen trapped in a boat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 01:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నెల్లూరు : ‘మురసు’ తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో అల‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారడంతో ... సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు జువ్వలదిన్నె తీరంలో చిక్కుకుపోయారు. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో తీరానికి ఐదు కిలోమీట‌ర్ల దూరంలో లంగరు వేసుకుని ఉండిపోయారు. బోటులో ఏడుగురు మత్స్యకారులు చిక్కుకుపోయారు. ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు స్థానిక మత్స్యకారుల సహకారంతో అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో అప్రమత్తంగా వ్యవహరించిన మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్