సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మృతదేహాలే వైద్య విద్యార్థులకు తొలి గురువులు

1 గంట క్రితం

Dead bodies are the first teachers for medical students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 02:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాడవెరిక్ ప్రమాణ స్వీకారంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. శంకర్

ఘనంగా పుష్పాంజలి ఘటించిన అధ్యాపకులు, విద్యార్థులు


ప్రజాశక్తి – అనంతపురం : వైద్య విద్యలో మృతదేహాల ప్రాధాన్యత ఎంతో గొప్పదని, వైద్య విద్యార్థులకు ఆ మృతదేహాలే తొలి గురువులని అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. శంకర్ అన్నారు. సోమవారం అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోని అనాటమీ విభాగం ఆధ్వర్యంలో డిసెక్షన్ హాల్‌లో కాడవెరిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా, గౌరవప్రదమైన వాతావరణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆర్. శంకర్ ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ దేహాలను వైద్య విద్యార్థుల అభ్యసనం కోసం దానం చేసిన దాతల నిస్వార్థ సేవ, త్యాగం వెలకట్టలేనివని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రాణత్యాగం తర్వాతి స్థానంలో నిలిచే దేహదానాన్ని ప్రతి వైద్య విద్యార్థి జీవితాంతం గౌరవంతో స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దాతల త్యాగానికి తగిన న్యాయం చేస్తూ బాధ్యతాయుతమైన వైద్యులుగా రూపుదిద్దాలని సూచించారు.అనంతరం అనాటమీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్‌చార్జి విభాగాధిపతి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలో అధ్యాపకులు డాక్టర్ నరేంద్ర నాయక్, డాక్టర్ షగీర్, డాక్టర్ ఆంజనేయబాబు నాయక్, డాక్టర్ భాను, డాక్టర్ భావన మరియు పీజీ విద్యార్థులు కలిసి మృతదేహ దాతలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించి, కాడవెరిక్ ప్రమాణ స్వీకారం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్