సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎంకె మాజీ మంత్రి కేసులో మద్రాస్‌ ఉత్తర్వుల్లో జోక్యానికి సుప్రీం నిరాకరణ

1 గంట క్రితం

T.N
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : డిఎంకె మాజీ మంత్రి టి.ఎన్.నెహ్రూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణం కేసులో త్వరిత విచారణ తప్పనిసరని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించింది. మంత్రి పదవి కింద నెహ్రూ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్థారణైందని పేర్కొంది. నెహ్రూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాన్న నెహ్రూ పిటిషన్‌ను విచారించేందుకు మద్రాస్‌ హైకోర్టు ఫిబ్రవరి 20న తిరస్కరించింది. అలాగే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ (డివిఎసి)ని ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్