పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలతో భార్య భర్తను దారుణంగా చంపిన సంఘటన పాలకొల్లు మండలం దగ్గులూరు లో సోమవారం ఉదయం జరిగింది. దగ్గులూరు కు చెందిన చల్లా సూర్యప్రకాశరావు ను భార్య వాణి త్రిపుర రోకలి బండతో దారుణంగా కొట్టి చంపడంతో సంఘటనా స్థలంలోనే అతడు ప్రాణం విడిచాడు. భార్యకు ఆమె తల్లిదండ్రులు కూడా సహకరించారు. బంటుమిల్లి కి చెందిన లోకేష్ రావు కోటి నాగమ్మ లు అల్లుడు మరణానికి కుమార్తెతో సహకరించారు. సూర్యప్రకాశరావుకు భార్య మేనకోడలు కావడం గమనార్హం . మృతదేహాన్ని వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశరావు దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ ఉండగా కుమారుడు వేలివెన్ను లో ఇంటర్ చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది. పాలకొల్లు రూరల్ సిఐ గుత్తుల శ్రీనివాస్ సారధ్యంలో కేసు విచారణ చేపట్టారు.
భర్తను చంపిన భార్య.. సహకరించిన ఆమె తల్లిదండ్రులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 02:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)