పల్నాడు : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అద్దంకి సెంటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆటోరిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (జిజిహెచ్) తరలించారు. మృతులను బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మగా గుర్తించగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో వేలూరు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Palnadu - ఘోర ప్రమాదం - ఏడుగురు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 09:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)