హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జివి.నారాయణ రావు (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా, కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. 1976 లో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 100కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. పలు టి.వి.సీరియళ్లలో కూడా నటించారు. నారాయణరావు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు. రజనీకాంత్, చిరంజీవి కి నారాయణరావు మంచి మిత్రులు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ , చిలకమ్మ చెప్పింది , గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళి నీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. నారాయణరావు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం తెలిపారు.
సీనియర్ నటుడు, నిర్మాత జివి.నారాయణరావు కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 09:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)