మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పనులు వెంటనే ఆపాలి...

1 రోజు క్రితం

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పనులు వెంటనే ఆపాలి
- కృష్ణా బోర్డుకు బిఆర్ఎస్ ఫిర్యాదు
 ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కృష్ణా బోర్డుకు బిఆర్ఎస్ ఫిర్యాదు

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ​ఆంధ్రప్రదేశ్‌ ‌నీళ్ల దోపిడికి కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌వత్తాసు పలుకుతోందని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని బిఆర్ఎస్ నాయకుల బృందం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) చైర్మన్‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమపై నమోదైన అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎపికి దాసోహం అంటున్నారని విమర్శించారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి సొరంగాల ద్వారా నీటిని అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనివల్ల సాగర్ ఆయకట్టు రైతులతో పాటు హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ‘నగరంలో రూ.800 ఉన్న వాటర్ ట్యాంకర్ రూ.రెండు వేలకు కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి కష్టాలతో హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. సాగునీటి ఇబ్బందులతో రాష్ర్టంలో 25 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఇప్పటికే సింగూరు మంజీర పూర్తిగా ఎండిపోయాయి’ అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో ఇప్పటికే ఎపి తన వాటా కంటే ఎక్కువగా నీటిని వాడుకుందని స్పష్టం చేశారు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలనీ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణకు అందించాలని బిఆర్ఎస్ నేతలు డిమాండ్‌ చేశారు. నాగార్జునసాగర్‌ నుంచి పల్నాడు ప్రాంతానికి నీటిని తరలించేందుకు ఎపి ప్రభుత్వం చేపడుతున్న పనులకు సరైన అనుమతులు, నీటి కేటాయింపులు లేవని బిఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కెఆర్‌ఎంబికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే డి సుధీర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్