ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్ యాత్ర వ్యక్తిగతం

2 గంటల క్రితం

janasena.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జనసేన కేంద్ర కార్యాలయం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డిప్యూటీ సిఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్ సోమవారం తిరుత్తణి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, ఎవరూ తనను అనుసరించొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. సోమవారం మధ్యాహ్నం తమిళనాడులోని తిరుత్తణిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం సాయంత్రం తిరుమలకు చేరుకుంటారని పేర్కొంది. అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిపింది. ఈ పర్యటనను భక్తి, ఆధ్యాత్మిక చింతనతో సాగించాలనే ఉద్దేశంతో జనసేన నాయకులు, అభిమానులు ఎవరూ వెంట రావొద్దని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్