శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విడదల రజినీపై పోలీసుల దౌర్జన్యం..

40 నిమిషాల క్రితం

si.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 07:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చిలకలూరిపేట :చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి విడదల రజినీని పోలీసులు కింద పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వైసిపిఅభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో,రజినిని కలవడానికి యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి పందుల బుల్లబ్బాయిని వచ్చారు.ఈ నేపథ్యంలోనే తనను కలిసేందుకు వచ్చిన బుల్లబ్బాయిని పరామర్శించేందుకు విడదల రజిని ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు.ఆ సమయంలో అక్కడే ఉన్న చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక ఆమెను అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఎస్ఐ ప్రియాంక విడదల రజినీపై దౌర్జన్యానికి దిగారు.తోసేయడంతో ఆమె కింద పడిపోయారు.మాజీ మంత్రి ఇంట్లోనే పోలీసుల దౌర్జన్యపై వైసిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్