శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్తతరం...కొత్త ఆలోచన: జోరుగా ఛైర్‌‌పర్సన్‌ టిడిపి అభ్యర్థి ప్రచారం

13 నిమిషాల క్రితం

కొత్తతరం...కొత్త ఆలోచన
యువతకు రాజకీయ ప్రోత్సాహం...
జోరుగా ఛైర్‌‌పర్సన్‌  టిడిపి అభ్యర్థి ప్రచారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 06:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కొత్తతరం ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ, యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ కదిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా కదిరి ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ కొత్త తరాన్ని కదిరి ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు దగ్గరగా చేరువయ్యేందుకు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసేలా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కొత్త తరం యువతి ఆర్షియా భానును కదిరి మున్సిపల్ పీఠం పై కూర్చోబెట్టేలా పావులు కదిపాడు. ఆమెకి రాజకీయ అవకాశం కల్పించడం పై కదిరి పట్టణ రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది .రాజకీయాల్లో యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా కొత్త ఆలోచనలు, నూతన ప్రణాళికలతో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చనే ఉద్దేశంతో యువతరానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే కందికుంట తెలిపారు. కేవలం పదవులకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. కదిరి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు, వీధి దీపాలు, పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ క్రమంలో యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో షేక్ ఆర్సియా భానును మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు. యువతలో ఉన్న ఉత్సాహం, కొత్త ఆలోచనలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత పట్టణ ప్రగతికి దోహదపడతాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కందికుంట పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కదిరి నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే కోరారు. మున్సిపాలిటీలో సమర్థవంతమైన పాలనకు ప్రజలు తోడ్పడితే పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చన్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపితే పట్టణ ప్రగతికి అవసరమైన కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


​ఈద్గా అభివృద్ధికి ప్రాధాన్యత......

​కదిరి పట్టణంలోని మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తాము ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే కందికుంట తెలిపారు. ఈద్గా అభివృద్ధి పనులను చేపట్టి మైనార్టీ సోదరులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈద్గా అభివృద్ధికి కృషి చేశామని ఆయన వెల్లడించారు.మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా కృషి చేస్తామని చెప్పారు. పట్టణంలో నిర్వహించిన ఇస్తమా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా బస్సుల సౌకర్యం ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యేను పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రజల మతపరమైన, సామాజిక కార్యక్రమాలకు అవసరమైన సహకారం అందించడం ప్రజాప్రతినిధిగా తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

​ కదిరి పట్టణాన్ని మరింత సుందరంగా, అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు అవకాశాలు కల్పిస్తూ, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని, చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ ఆర్సియా భానుకు ప్రజలు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్