ప్రజాశక్తి – హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన క్లీన్ లేబుల్ డెయిరీ, సహజ ఆహార ఉత్పత్తుల బ్రాండ్ వి-రిచ్ నగరంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో రోజువారీ గేదె పాల సబ్‌స్క్రిప్షన్లను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ పూర్తిగా సమీకృతమైన ‘ఫామ్ టు డోర్‌స్టెప్’ (వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా ఇంటికి) సరఫరా విధానంపై ఆధారపడి ఉందని సంస్థ తెలిపింది. తమ సొంత ప్రత్యేక ఫారాల ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్న వి-రిచ్, పశువుల సంరక్షణ, దాణా పద్ధతులు, ఫారాల నిర్వహణ, పాల సేకరణ, నిల్వ వంటి అంశాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ కలిగి ఉందని పేర్కొంది. అదే రోజు పాల సేకరణ విధానాన్ని అనుసరించడం వల్ల పాలపై కనీస ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతుందని వివరించింది.
పాల భద్రత కోసం పాశ్చరైజేషన్ ప్రక్రియను చేపడుతున్నామని, వాటి సహజమైన చిక్కదనం, కొవ్వు నిర్మాణాన్ని కాపాడేందుకు హోమోజనైజేషన్ చేయడం లేదని సంస్థ వెల్లడించింది. ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు, రసాయన సంకలితాలు, కృత్రిమ స్టెబిలైజర్లు లేకుండా 6 శాతం కొవ్వు కలిగిన ఫుల్ క్రీమ్ వేరియంట్, 3 శాతం కొవ్వు కలిగిన టోన్డ్ వేరియంట్ పాలను అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా వి-రిచ్ ప్రతినిధి మాట్లాడుతూ, “మా పాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయనే విషయంలో మేము ప్రత్యక్షంగా భాగస్వాములమవుతున్నాం. పశువులకు అందించే మేత నుంచి ఫారాల నిర్వహణ వరకు ప్రతి అంశంలోనూ నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం. నాణ్యత అనేది ఉత్పత్తి మూలం వద్దనే ప్రారంభమవుతుందని మేము నమ్ముతున్నాం. హైదరాబాద్‌లో మా కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో, ఇప్పటికే వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, అదే నాణ్యతా ప్రమాణాలతో మరిన్ని ఇళ్లకు మా ఉత్పత్తులను చేరువ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)