బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్ల పేరుతో రాజకీయ బెదిరింపులు - ఎంపీడీవో తీరుపై పెన్షన్ దారుల ఆరోపణలు

30 నిమిషాల క్రితం

lcal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 02:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కూటమి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.?

- వైసీపీ సానుభూతి పరులకు నోటీసులపై వివాదం..!!

ప్రజాశక్తి-నందిగామ : జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ మండలం, కొండూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక పెన్షన్ దారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ​కూటమి నాయకుల ఒత్తిడితో ఎంపీడీవో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన పింఛన్ లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని, వారికి నోటీసులు జారీ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఓటు వేయకపోతే పింఛన్ కోత అంటూ హెచ్చరికలు..!!

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తేనే పింఛన్ కొనసాగుతుందని, లేనిపక్షంలో పింఛన్ తొలగిస్తామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్ష సానుభూతి పరులే లక్ష్యం..!!

కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ సానుభూతిపరులను గుర్తించి నోటీసులు ఇస్తున్నారని పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘన..!!

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుపెట్టుకుని ఓటర్లను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ​మరోవైపు, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుండి లేదా కూటమి నాయకుల నుండి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. నిబంధనల ప్రకారమే నోటీసులు జారీ అవుతున్నాయా లేక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్