న్యూఢిల్లీ : లండన్ వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కో-కన్వీనర్ సౌరవ్ దాస్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. బుధవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా ఆ పిటిషన్‌లో కోరారు. ఈ అంశాన్ని గురువారం విచారణకు స్వీకరించనున్నట్లు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్‌సంజయ్ శర్మలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కాక్రోచ్ ఉద్యమంపై ప్రసింగించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తనను ఆహ్వానించిందని, దీంతో మంగళవారం తెల్లవారుజామున విమానం ఎక్కేందుకు వెళ్లిన తనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద నిలిపివేశారని పేర్కొన్నారు. ‘‘నన్ను ఇమ్మిగ్రేషన్ వద్ద ఆపారు. నాకు ఎలాంటి త్తర్వు జారీ చేయలేదు. ఎటువంటి ఎల్‌ఒసి లేదు. నేను ప్రయాణించకుండా ఏ అధికార సంస్థ నుండి ఎటువంటి నిషేధం లేదు. నేను ఈ రోజు పిటిషన్‌ను విచారించాలని కోరాను. నవంబర్ 27న లండన్‌కు వెళ్లగలను ’’ అని సౌరవ్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషన్‌పై గురువారం విచారణ చేపడతామని ధర్మాసనం బదులిచ్చింది.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సౌరవ్‌దాస్
13 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 02:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)