గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్‌ విధుల్లో టీచర్‌ మృతి

1 గంట క్రితం

1200-675-28046097-thumbnail-16x9-cm-respond-on-poling-officer-death.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట గ్రామంలో గురువారం పోలింగ్‌ ‌సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌ విధులకు హాజరైన గుంతకల్లు పట్టణానికి చెందిన హరిత గౌడ్‌ (56) అనే ఉపాధ్యాయురాలు హఠన్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.హిరేహాల్‌ ‌మండలం కాజలూరు జిల్లా పరిషత్‌ ‌హైస్కూల్లో ఆమె ఎస్‌‌జిటి ఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్నన్నారు. పోలింగ్‌ విధుల్లో భాగంగా కడదరకుంట గ్రామానికి వచ్చారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయారు. సహచర సిబ్బంది ఆమెను కూడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హరితకు భర్త, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, సుదూర ప్రాంతంలో విధులకు పంపడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించారని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్