గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిఎస్‌సి మెయిన్స్‌ ఫలితాలు విడుదల

20 నిమిషాల క్రితం

UPSC CSE Mains results released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 2,526 మంది అర్హత

న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష 2026 ఫలితాలు గురువారం విడుదల య్యాయి. వీరిలో 2,526 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన 13,343 మంది అభ్యర్థుల కు ఆగస్టు 21 నుండి 30 వరకూ రాత పరీక్షకు నిర్వహించారు.

వారిలో 2,526 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలను నింపి, అప్‌డేట్ చేయాలి. ఈ సౌకర్యం యుపిఎస్‌సి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ నెల 11 నుంచి ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఇంటర్వ్యూలు న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్, ధోల్పూర్ హౌస్‌లోని కమిషన్ కార్యాలయంలో జరుగుతాయని యుపిఎస్‌సి పేర్కొంది. ఇంటర్వ్యూలు, తుది ఫలితాలు ప్రకటించిన 15 రోజులలోపు అభ్యర్థులందరి మార్క్‌షీట్లు కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయని తెలిపింది. అవి 30 రోజుల పాటు అందుబాటు లో ఉంటాయని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్