మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జగన్‌‌కు అధికారం పగటి కలే

3 రోజుల క్రితం

varla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌‌మోహన్‌ ‌రెడ్డికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చే పరిస్థితి లేదని, ఆయనకు అధికారం పగటి కలే అని టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. కేవలం మిగిలిన కొద్దిపాటి క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ‘మళ్లీ వస్తాం’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి జగన్‌‌కు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించకపోవడం, వైసిపి అభ్యర్థులు పోటీ చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం, పోటీ చేసిన చోట్ల ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వైసిపికి ప్రతికూలంగా వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు.ఇందులో భాగంగానే గవర్నర్‌ను కలవడానికి జగన్ వెళ్తున్నారని తెలిపారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పదేపదే చెబుతున్న జగన్‌ ఏ గ్రామంలో అడ్డుకున్నారు? ఏ అభ్యర్థిని అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకున్నారు? ఏ సమయంలో ఈ ఘటన జరిగింది? అప్పట్లో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఎవరు? అనే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పగలరా? అని సవాల్ విసిరారు.జరిగిన ఘటనలను ఆధారాలతో చూపించకుండా పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని పేర్కొన్నారు.

పల్నాడులో టిడిపి నేతలపై దాడులు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు సందర్భంగా పల్నాడు జిల్లాలో వైసిపి శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌ ‌బాబు, బయోడైవర్సిటీ చైర్మన్‌ ‌నీలాయపాలెం విజయ్‌‌కుమార్‌, ఎపిఇడబ్ల్యూఐడిసి చైర్మన్‌ ఎస్‌ ‌రాజశేఖర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌అనిల్‌ ‌చంద్ర పునేఠాను శనివారం కలిసి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్