అమరావతి : రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద, హోర్డింగుల వద్ద నిలబడవద్దని వాతావరణ శాఖ సూచించింది.
Rains - రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వానలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)