రామగుండం : అల్పపీడనం ప్రభావంతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండ్రోజులుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణికి సంబంధించిన నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో రోజుకు సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ప్రస్తుతం నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో రోడ్లన్నీ బురదమయమై ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది. పని ప్రదేశంలో వరద నీటిని తొలగించి యంత్రాలు నడిచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
రామగుండంలో వర్షం .. 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
25 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)