ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మట్టి గణపతుల పంపిణీ

16 నిమిషాల క్రితం

ganesh 2.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి –విజయనగరం టౌన్: శ్రీ ముత్యమాంబ సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేట గౌడివీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం (కొత్తకోవెల) వద్ద అసోసియేషన్ సభ్యులు మద్దాల సత్యారావు నాయుడు ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని భక్తులకు ఉచితంగా 800 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యారావు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఇకపై ప్రతి వినాయక చవితికి ఇదే విధంగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తూ తన వంతుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్