అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. వరసగా ఏర్పడిన అల్పపీడనాల కారణంగా వానలు కురుస్తున్నాయని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వానలు పడతాయి చెప్పింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతోనే వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రలో కొంత తేలిక పాటి జల్లులతో పాటు మోస్తరు వానలు పడతాయని, అలాగే రాయలసీమలో తేలిక పాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నేడు వానలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీయవచ్చు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి ఉంటుందని, తేలికపాటి జల్లులు లేదా వర్షం పడే సూచనలున్నాయి. తెలంగాణ ఆనుకున్న రాయలసీమదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణవైపు విస్తరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.








కామెంట్‌లు (0)