ముంబయి : రెండు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం బ్రేక్ వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, ఫార్మా, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరగగా, నిఫ్టీ 24,150 పాయింట్ల ఎగువన స్థిరపడింది. క్రితం ముగింపు 76,933.59 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ 77,128.05 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సానుకూల ధోరణిలో కొనసాగిన సూచీ ఇంట్రాడేలో 77,357.97 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 330.92 పాయింట్లు పెరిగి 77,264.51 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 84.80 పాయింట్లు లాభపడి 24,175.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.39గా ఉంది. సెన్సెక్స్-30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 88.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,603 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Markets - రెండు రోజుల నష్టాలకు బ్రేక్ .. లాభాల్లో ముగిసిన సూచీలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)