మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూకాంబిక విశిష్టతను విశదపరిచేందుకు అన్ని చర్యలు : ఈవో వీర్రాజు చౌదరి, చైర్మన్ అప్పారావు

28 ఆగస్టు, 2026

All measures being taken to highlight the significance of Goddess Nookambika: EO Veeraraju Chowdary, Chairman Apparao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీనూకాంబికా విశిష్టతను విషదపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో యు.వీర్రాజు చౌదరి, చైర్మన్ వీరి అప్పారావు అన్నారు. ఇందులో భాగంగా అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవంగా దేవస్థానం ప్రాంగణంలో వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి నూతనంగా ప్రవేశపెట్టిన "నది జలములతో ప్రత్యేక అభిషేకం" కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా జరిపించారు. స్థానికంగానే కాక పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన మహిళా యాత్రికులతో పెద్దింటి మణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత మహోత్సవం ఉన్నతంగా నిర్వహించారు.


యాత్రికులకు కానుకలు, సేవా సత్కారం.

వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళా యాత్రికులందరికీ అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు, అమ్మవారి శేష వస్త్రంగా చీర, జాకెట్టు ముక్క, శ్రీవరలక్ష్మి అమ్మవారి ప్రతిమతో రూపులు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారం ఉచిత అన్నప్రసాద వితరణ. ప్రతి శుక్రవారం మాదిరిగానే అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులందరికీ దేవస్థానం తరఫున ఉచిత అన్నప్రసాద వితరణ చేసారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్