వైద్యారోగ్యశాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో 1,688 వైద్య బృందాలు, 116 సహాయ శిబిరాలను సిద్ధం చేసినట్లు ఆ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 13,165 అత్యవసర పడకలు, అవసరమైన మందులు, 43,672 పాముకాటు నివారణ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు, 733 అత్యవసర అంబులెన్సులు, 300 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు, 721 సంచార వైద్య వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపింది. అన్ని వైద్యశాలల్లో అవసరమైన మందులను సిద్ధం చేసినట్లు తెలిపింది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా 1,833 వైద్యశాలల్లో జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్తు సదుపాయాలను సిద్ధం చేయడం, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అంటువ్యాధుల నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రసవ గడువు ఉన్న 6,870 మంది గర్భిణులను గుర్తించి, వీరిలో 493 మందిని ఇప్పటికే సమీప వైద్యశాలలకు తరలించినట్లు పేర్కొంది.







కామెంట్లు (0)