ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionత్వరలో మహిళల కబడ్డీ ప్రీమియర్ లీగ్‌

1 గంట క్రితం

కబడ్డీని ఒలింపిక్‌ గేమ్‌ను చేయటమే లక్ష్యం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 11:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కబడ్డీని ఒలింపిక్‌ గేమ్‌ను చేయటమే లక్ష్యం

  • ఐకెఎఫ్‌ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌

ప్రజాశక్తి-హైదరాబాద్‌ : 2036 ఒలింపిక్స్‌లో కబడ్డీని గేమ్స్‌ జాబితాలో చేర్చటమే లక్ష్యంగా పని చేస్తున్నామని, 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సైతం కబడ్డీని చేర్చేందుకు కృషి చేస్తున్నామని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకెఎఫ్‌) అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కబడ్డీ భవిష్యత్‌ రోడ్‌మ్యాప్‌, ఒలింపిక్స్‌ సహా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో చేర్చే ప్రణాళిక సహా ప్రపంచవ్యాప్తంగా ఆటను అభివృద్ది చేయటంపై చర్చించారు. ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చితే ఆటకు గ్లోబల్‌ ఆదరణ దక్కుతుందని, మరింత మంది కబడ్డీని ఆడేందుకు ముందుకొస్తారని కాసాని అన్నారు. 'ఐకెఎఫ్‌ కబడ్డీ ప్రపంచకప్‌తో పాటు మహిళల మహిళల కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ప్రపంచకప్‌ నిర్వహణకు సభ్య దేశాల నుంచి బిడ్లు ఆహ్వానించాం. బిడ్లు, వ్యయంపై సమీక్ష అనంతరం ప్రపంచకప్‌ వేదికను ప్రకటిస్తామని' కాసాని అన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటేశ్‌ బండారి, గోవింద్‌ నారాయణ్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్