న్యూఢిల్లీ : అక్టోబరులో వస్తు, సేవల పన్ను వసూళ్లు (జిఎస్‌టి) దేశంలో రూ.2.31 లక్షల కోట్లను దాటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైంది. ఈ మేరకు జిఎస్‌టి వివరాలను కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసింది. దేశీయ లావాదేవీల ద్వారా 16 శాతం వృద్ధి చెంది రూ.1.59 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. విదేశీ దిగుమతుల ఆదాయం 42 శాతం పెరిగి రూ.72,246 కోట్లు సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం వసూళ్లలో కేంద్ర జిఎస్‌టి కలెక్షన్స్ రూ.42,935 కోట్లు, స్టేట్ జిఎస్‌టి కలెక్షన్స్ రూ.51,340 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి వసూళ్లు రూ.1.37 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. రిఫండ్స్ రూపంలో రూ.27,934 కోట్లు చెల్లించగా.. నికరంగా రూ.2.03 లక్షల కోట్లు జిఎస్‌టి వసూళ్లు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య కాలంలో స్థూల జిఎస్‌టి వసూళ్లు 13.2 శాతం వృద్ధి నమోదు చేసి రూ.14.77 లక్షల కోట్లకు చేరాయి. నికరంగా 13 శాతం పెరిగి రూ.12.69 లక్షల కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
Print Editionజిఎస్‌టి వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 11:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)