శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

21 రోజుల్లో మరణాల నమోదు : వైద్యారోగ్యశాఖ

1 గంట క్రితం

AP HEALTH
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లోపు జరగాలని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలు, ఇతర మెడికో-లీగల్ కేసుల్లో మరణాలు సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్లకు సకాలంలో నివేదించకపోవడంతో నమోదు ఆలస్యమవుతోందని గుర్తించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిజిపికి ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. దీనికనుగుణంగా డిజిపి కార్యాలయం రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, ఎస్‌‌పిలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సర్క్యులర్ జారీ చేసింది. చట్టం ప్రకారం నిర్ణీత ఫారం-IIలో మరణ వివరాలను రిజిస్ట్రార్లకు నివేదించాలని ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్