శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionZIM vs RSA : దక్షిణాఫ్రికా శుభారంభం

1 గంట క్రితం

south-africa-won-by-seven-wickets-with-62-overs-to-spare
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • టి20 ముక్కోణపు సిరీస్‌

విండ్‌‌హోక్‌ (‌నమీబియా): టి20 ముక్కోణపు సిరీస్‌‌లో దక్షిణాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. జింబాబ్వేతో శనివారం జరిగిన మ్యాచ్‌‌లో దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌‌కు దిగిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 13.4ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. బ్రెవీస్‌(75‌నాటౌట్‌; 32బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సర్లు)కి తోడు ప్రిటోరియస్‌(22), జోర్డాన్‌(20) బ్యాటింగ్‌‌లో రాణించారు. జోర్జి(15) నిరాశపరిచినా.. రాబిన్‌(11‌నాటౌట్‌) ‌మరో వికెట్‌ ‌పడకుండా మ్యాచ్‌‌ను ముగించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ‌బ్రెవీస్‌‌కు దక్కింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన జింబాబ్వేకు శుభారంభం లభించింది. ఓపెనర్లు బెన్నెట్‌(34), బెన్‌ ‌కర్రన్‌(24) తొలి వికెట్‌‌కు 45పరుగులు జతచేశారు. వీరిద్దరు ఔటయ్యాక జింబాబ్వే ఇన్నింగ్స్‌ ‌కుప్పకూలింది. లోయర్‌ ఆర్డర్‌‌లో వికెట్‌ ‌కీపర్‌ మరుమణి(30) మినహా మరే బ్యాటర్‌ ‌రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లు యాన్సెన్‌‌కు మూడు, సుబ్రయన్‌ రెండు వికెట్లకు తోడు బోట్జ్‌, మఫకా, ఫోర్చూన్‌ ఒక్కో వికెట్‌‌తో రాణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్