శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గాయంతో ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం

1 గంట క్రితం

Neeraj Chopra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 10:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: భారత జావెలిన్‌ ‌స్టార్‌ ‌నీరజ్‌ ‌చోప్రా ఆసియా క్రీడలకు దూరమయ్యాడు. శిక్షణ సమయంలో చీలమండ ‘లెగ్‌మెంట్‌’కు గాయమైంది. దీంతో సెప్టెంబరులో జరగనున్న ఆసియా క్రీడలకు దూరమైనట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా శనివారం సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘‘ఎంతో కష్టపడిన తర్వాత లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లో అత్యుత్తమ (88.05 మీటర్లు)త్రోను అందుకున్నట్లు అనిపించింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది కాలానికే శిక్షణ సమయంలో నా చీలమండ వద్ద లిగమెంట్ చిట్లిపోయింది. వైద్యుడితోపాటు నా టీమ్‌తో చర్చించిన అనంతరం ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది నిరాశ కలిగించే విషయం. నా ఆటలో రిథమ్‌ను అందుకునే దశకు చేరుకున్నానని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం. ఇప్పుడు నా దృష్టి పూర్తిగా కోలుకోవడం, మరింత దృఢంగా తిరిగి రావడంపైనే ఉంది’’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ గాయం కారణంగా సెప్టెంబరు 5న బ్రసెల్స్‌లో జరగనున్న డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు కూడా నీరజ్ దూరంకానున్నాడు. సెప్టెంబరు 11 నుంచి 13 వరకు జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ అల్టిమేట్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పాల్గొనడం లేదు. ఆసియా క్రీడలు సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్