గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 కోట్లు

2 రోజుల క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను కేటాయిస్తూ, త్రైమాసికాల వారీగా వినియోగించాలని ఆదేశించింది. మొదటి త్రైమాసికంలో రూ.35 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.20 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.20 కోట్లు, నాల్గో త్రైమాసికంలో రూ.25 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ నిధులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. నిధుల వినియోగంలో నిర్దేశిత విధానాలు, బిల్లుల ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతులను బలోపేతం చేయడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్