ప్రజాశక్తి - బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం కాండ్ల మడుగు క్రాస్ వద్ద అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు బొలెరో వాహనంలో తరలిస్తున్న సుమారు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బొలెరో వాహనంతో పాటు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బి.కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుండి బి.కొత్తకోట పౌరసరఫరాల గోదాంకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సంబంధిత అధికారుల విచారణ కొనసాగుతోంది.
రేషన్ బియ్యం పట్టివేత
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 02:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)