గురజాల (పల్నాడు) : ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై దాడి జరిగిన ఘటన ఆదివారం పల్నాడు జిల్లా గురజాలలో మాచర్లలో జరిగింది. మాచర్ల వెళుతున్న ఆర్టీసీ బస్సును మాడుగుల అడ్డరోడ్డు వద్ద ఆపాలని ఓ మహిళ కోరింది. అక్కడ కాకుండా ముందుకెళ్లి డ్రైవర్ బస్సును ఆపాడు. అనంతరం మాచర్ల వెళ్లి వస్తున్న బస్సును మహిళ, ఆమె కుటుంబసభ్యులు బైక్‌లతో అడ్డుకున్నారు. డ్యూటీ మారిన కండక్టర్, డ్రైవర్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. కండక్టర్ సోమయ్య ఫిర్యాదు మేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పై దాడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)