ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వృద్ధుడినయ్యా.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి

1 గంట క్రితం

I have grown old... I am not sure if I will contest the upcoming elections: MLA Akbaruddin Owaisi.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కేశవగిరి (బండ్లగూడ) : మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రస్తుతం 55 సంవత్సరాలు వచ్చాయని, వృద్ధుడినైనందున రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని, బహుశా పోటీ చేయకపోవచ్చని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. పాతబస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసి ఎడ్యుకేషనల్ క్యాంపస్ (కేజీ టూ పీజీ) లో ఒవైసీ కాలేజీలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్బరుద్దీన్ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేవలం 12వ తరగతి వరకే చదివానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడనని ఎమ్మెల్యే అక్బరుబ్బీన్ అన్నారు. తక్కువ చదువు చదివినప్పటికీ, ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించడంతోపాటు ఎన్నో ఒవైసీ విద్యాసంస్థల భవనాలను నిర్మించినందుకు గర్వంగా ఉందన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తన పరువు తీయడానికి, ఇబ్బందులకు గురిచేయడానికి రకరకాల కుట్రలు చేస్తున్నారని, కానీ తాను ఎవరి ముందూ తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ దేశం, ఈ గడ్డ అందరిదని, ఇక్కడ ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పేర్కొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్