ప్రజాశక్తి-అనంతపురం: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనంతపురం ప్రెస్‌క్లబ్ అడహక్ కమిటీ చర్యలు చేపట్టింది. డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో అందిస్తున్న ఈ సేవలకు సంబంధించిన కూపన్లను ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పంపిణీ చేశారు. అక్టోబర్ 5 నుంచి 10వ తేదీ వరకు వర్కింగ్ జర్నలిస్టులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో జూడియో వస్త్ర దుకాణం పైభాగంలో ఉన్న డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిని సంప్రదించి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. నిర్ణీత గడువులో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. నలుగురు సభ్యులతో కూడిన కుటుంబానికి ఒక కూపన్, వ్యక్తిగతంగా వినియోగించుకునేందుకు మరో కూపన్‌ను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కూపన్ల పంపిణీ కార్యక్రమంలో అనంతపురం ప్రెస్‌క్లబ్ అడహక్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లెబోయిన రామాంజనేయులు, కోశాధికారి కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి, సభ్యులు కేపీ కుమార్, సీనియర్ జర్నలిస్టులు అమినేని రవిచంద్ర, డాక్టర్ సూర్య, డేవిడ్ (బాలవెంకటయ్య), సాక్షి శంకర్, హిందూ ఫొటోగ్రాఫర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
5 నుంచి 10 వరకు జర్నలిస్టులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)