శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ కేసు సిబిఐ కి బదిలీ

1 గంట క్రితం

Sai Krishna case transferred to CBI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సిబిఐ కి బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కేసును సిబిఐ కి అప్పగించాలంటూ సాయికృష్ణ తల్లితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎపి హైకోర్టు.. నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసును విచారించడానికి తమకేమీ అభ్యంతరం లేదని సిబిఐ పేర్కొంది. అలాగే, సాయికృష్ణ తల్లి విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం నాలుగు వారాలలోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎపి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించే అంశం కీలకంగా మారింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ నుంచి సాయికృష్ణ అదృశ్యం కావడం, పోలీసుల అదుపులో ఉండగానే అతడు మృతి చెంది ఉంటాడన్న ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కేసును మరింత తీవ్రతరం చేశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్