శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోయంబత్తూరులో ‘పెరియార్ అరివులగం’ను ప్రారంభించిన సిఎం విజయ్‌

1 గంట క్రితం

Tamil Nadu CM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కోయంబత్తూరులో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘పెరియార్ అరివులగం’ ( గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం)ను ప్రారంభించారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్‌కు మంత్రులు పి. ఆనంద్, సంపత్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పెరియార్ అరివులగం ప్రారంభోత్సవం అనంతరం డిజిటల్ లైబ్రరీ, ప్లానెటేరియంతో సహా కేంద్రంలోని వివిధ విభాగాలను ఆయన సందర్శించనున్నారు. పలు ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా ప్రారంభించడంతో పాటు, సుమారు 2,000 మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. అనంతరం ఆయన నవరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు కేరళలోని త్రిస్సూర్‌కు బయలుదేరనున్నారు. కోయంబత్తూరు-అవినాశి రోడ్డులోని పీఆర్ఎస్ గ్రౌండ్స్‌లో సిఎం కోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. త్రిస్సూర్‌లో నవరాత్రి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి కోయంబత్తూరుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్