44 వార్డులకు నమోదు కాని నామినేషన్
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : చీరాల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా ... నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చీరాల డీఎస్పీ అబ్దుల్ మోయిన్, వన్ టౌన్ సిఐ సోమశేఖర్తో కలిసి మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను చీరాల మున్సిపల్ కమిషనర్ జోసఫ్ డానియల్ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.







కామెంట్లు (0)