రాజంపేట ఎం.పి 6 వాహనాల ధ్వంసం - ఎస్పి సందర్శన
ప్రజాశక్తి-పుంగనూరు (అన్నమయ్య) : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ మొదటి రోజు ప్రారంభంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ లకు ఆరు వాహనాలలో నామినేషన్ కేంద్రాన్ని అతివేగంగా వచ్చారు. స్పీడ్ గా రావడంతో టీడీపీకి చెందిన మధుసూదన్ రాయల్, సుహేల్ భాషలు అడ్డుకోవడం వారిపై దాడి చేయడంతో వివాదం చోటు చేసుకున్నది. అప్పటికే భారీగా మోహరించిన కుటమి నేతలు వారిపై దాడి చేశారు. దాడిలో ఆరు వాహనాలు అద్దాలు పగలగొట్టి వాహనాలపై రాళ్లతో కట్టెలతో దాడి చేశారు. వెంటనే పోలీసులు భద్రత మధ్య మిథున్ రెడ్డి ని తరలించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కు నుబిల్లి నామినేషన్ కేంద్రం సందర్శించి వివాదాలు జరగకుండా మీడియాతోపాటు, టిడిపి నేతలను బయటకు పంపడం జరిగింది.







కామెంట్లు (0)