- పోలీస్ స్టేషన్లోనే నామినేషన్ ఏర్పాటు చేయండి
- పోలీసులను ప్రశ్నించిన ఎంపీ అవినాష్ రెడ్డి
ప్రజాశక్తి-పులివెందుల టౌన్: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వైసీపీ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, కాబట్టి పోలీస్ స్టేషన్లోనే నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. బుధవారం సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మంగళవారం రాత్రి నియోజకవర్గ పరిధిలోని తొండూరు, సింహాద్రిపురం పులివెందుల మండలానికి సంబంధించిన పలు గ్రామాల వైసిపి మద్దతుదారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో ఎంపీ అవినాష్ రెడ్డి బుధవారం ఉదయం స్థానిక డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి మద్దతుదారులు నామినేషన్ వేస్తే టిడిపి మద్దతుదారులు గెలవలేని ఉద్దేశంతో నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్నారన్నారు. వెంటనే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అర్బన్ సీఐ పురుషోత్తమ రాజు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. కనపల్లెకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎంపి అవినాష్ రెడ్డికి మహిళలు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్నా సిఐని మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందని ప్రశ్నించారు. దీంతో సీఐ తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. ఎన్నికలు జరగకూడదని ఆదేశాలు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)