మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తండ్రీకూతుళ్ల కథ

1 గంట క్రితం

తండ్రీకూతుళ్ల కథ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 06:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా ము. మారన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాన్న కుట్టి’. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో యాక్షన్‌, క్రైమ్‌ సస్పెన్స్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన కుమార్తెను ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు ఓ తండ్రి చేసే పోరాటం కథలో ప్రధానంగా ఉండనుంది. బేబీ లితన్య శివబాలన్‌, ప్రీతి అస్రానీ కీలక పాత్రల్లో నటించారు. విజయ్‌ ఆంటోనీ సంగీతం అందించడంతోపాటు ఎడిటింగ్‌ బాధ్యతలూ చేపట్టారు. తన కుమార్తె మీరా విజయ్‌ ఆంటోనీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమైంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్