సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యా నుంచి రక్షించండి.. తెలుగు యువకుల వేడుకోలు

1 గంట క్రితం

video
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నం జిల్లాకు చెందిన ఐదుగురు తెలుగు యువకులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ గంగరాజు ద్వారా మంచి భవిష్యత్తు, ఉపాధి అవకాశాల కోసం రష్యా వెళ్లిన వీరికి ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించలేదు. ఈ క్రమంలో ఓ నేపాల్ వ్యక్తి సూచనలతో రష్యా సైన్యంలో చేరినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వారిని బలవంతంగా యుద్ధ క్షేత్రంలోకి పంపిస్తున్నారని, ప్రాణాలకు ముప్పు ఉందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు.

రష్యా సైన్యంలో చేరిన ఐదుగురిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలారని విశాఖకు చెందిన వంశీ అనే యువకుడు తన తల్లికి పంపిన వీడియో సందేశంలో తెలిపాడు. "అమ్మా.. ఇదే నాకు చివరి వీడియో కావచ్చు. నన్ను ఎలాగైనా కాపాడండి" అంటూ అతడు చేసిన విజ్ఞప్తి కుటుంబ సభ్యులను కలచివేసింది. ప్రస్తుతం వంశీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వంశీ తల్లి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

స్పందించిన మంత్రి నారా లోకేశ్‌..

ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ‘‘విదేశాల్లో చిక్కుకుపోయిన మన పౌరుల దుస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. సంబంధిత అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూడండి. వారు సురక్షితంగా, త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టండి’’ అని తన కార్యాలయానికి ట్యాగ్‌ చేస్తూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఆ యువకులు మాట్లాడిన వీడియోను సైతం ఆయన షేర్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్