సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅందరినీ సంతృప్తిపరచలేం

1 గంట క్రితం

rahman.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​‘రామాయణ’ చిత్రంలోని ‘మంగళ్‌ రంగ్‌’ పాటపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి అభిప్రాయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలని స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. ఒక పాటను వెంటనే అంచనా వేయకూడదని, ఊరగాయలాగే స్వరాలు కూడా కాలం గడిచేకొద్దీ మరింత రుచిగా మారతాయని వ్యాఖ్యానించారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రానికి రెహమాన్‌, హాలీవుడ్‌ సంగీత దర్శకుడు హాన్స్‌ జిమ్మర్‌ కలిసి పనిచేస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్