సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం

4 గంటల క్రితం

మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

2020లో ప్రేమ బంధం అర్ధాంతరంగా ముగియడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని నటి రెజీనా వెల్లడించారు. ఆ సంబంధంలో మోసపోవడంతో కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడ్డానని తెలిపారు. నయనతార అమ్మవారిగా నటిస్తున్న ‘మహాశక్తి’ చిత్రంలో రెజీనా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆ కష్టకాలం నుంచి బయటపడేందుకు తనకు తాను సమయం కేటాయించుకున్నానని, మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. లైంగిక వేధింపులు, ఇతర చేదు అనుభవాలు ఎదురైనప్పుడు బాధితులు తమను తాము నిందించుకోవద్దని సూచించారు. జరిగిన విషయాలను మనసులో దాచుకోకుండా నమ్మకమైన వారితో పంచుకోవాలని, ధైర్యంగా ముందుకు సాగాలని రెజీనా అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్