సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘డేర్‌ డెవిల్‌’ ప్రారంభం

2 గంటల క్రితం

Ajit Kumar’s daredevil .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటుడు అజిత్‌కుమార్‌ కథా నాయకుడిగా ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘డేర్‌ డెవిల్‌’ సినిమా ప్రారంభ కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. అజిత్‌ భార్య షాలిని ఈ చిత్రాన్ని బ్రేవ్‌ హార్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇది తొలి సినిమా. పూజా కార్యక్రమానికి దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌తో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, శ్రీలీల, ఉన్ని ముకుందన్‌, పార్థిబన్‌, ప్రభు, సునీల్‌, రెడిన్‌ కింగ్స్‌లీ తదితరులు హాజరయ్యారు. అజిత్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తర్వాత అజిత్‌, ఆదిక్‌ రవిచంద్రన్‌ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్