ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం..

2 గంటల క్రితం

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
- డిజిపి హరీష్ కుమార్ గుప్తా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డిజిపి హరీష్ కుమార్ గుప్తా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని డిజిపి హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక నిఘా కొనసాగించాలని జిల్లా, రేంజ్‌ అధికారులను ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, సంబరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రెండో విడతలో 27 జిల్లాల పరిధిలోని 241 మండలాల్లో 3,803 సర్పంచ్‌, 29,608 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ పూర్తయిందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 36,485 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రకాశం, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, తిరుపతి తదితర 15 జిల్లాల్లో 37 ఘటనలు నమోదైనట్లు తెలిపారు. వీటిపై కేసులు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలతో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలు, అభ్యర్థులు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్