- మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేర్కొన్నారు. ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి కన్నుమూయడంపై సంతాపం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి గారు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన కథానాయికగా నటించడంతో పాటు, తదనంతరం తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.








కామెంట్‌లు (0)