ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవాబుపేటలో ఘనంగా అంగన్‌వాడీల అభినందనోత్సవం

1 గంట క్రితం

Grand felicitation ceremony for Anganwadi workers in Nawabpet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ప్రధాని మోడి జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ.గజలక్ష్మి సూచనలు మేరకు మండలంలోని నవాబుపేట పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నాగ సత్యవేణి ఆధ్వర్యంలో అంగన్‌వాడీల అభినందన ఉత్సవాన్ని, గర్భిణీల సీమంతోత్సవాన్ని మాజీ ఉపసర్పంచ్, టిడిపి సీనియర్ నేత నామాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి(సత్తిబాబు) సమక్షంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సెక్టార్ పరిధిలో చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాధాన్యం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.​ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు పునాది అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పడుతుందని తెలిపారు.​ అలాగే వారంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంగన్వాడి టీచర్, హెల్పర్ ల సేవలను స్థానిక ఏరియా మహిళలు గుర్తించగా వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తోటకూర ప్రసాదరావు, యుటిఎఫ్ జిల్లా నేత, స్థానిక పాఠశాల హెచ్ఎం పి.వి.వి.జి.ఎస్.ఎన్.మూర్తి, పంచాయితీ కార్యదర్శి హనుమ, ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దిరాజు, అంగన్వాడి టీచర్ ఎన్.సుశీల, ఆశ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్